7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, 53 శాతం డీఏతో కనీస వేతనం పెరగనుందా
మరోవైపు ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రకటన 2025 ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ఉండవచ్చని తెలుస్తోంది.
డీఏ 50 శాతం దాటినప్పుడు కనీస వేతనంలో కలిపి జీరో నుంచి లెక్కించాలని 5,6 వేతన సంఘాల్లో సిఫారసు చేశారు. అందుకే ఈ విషయపై ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరుగుతాయి.
2025 జనవరిలో డీఏ ఎంత పెరుగుతుందనేది కాస్సేపు పక్కనబెడితే ఇప్పుడు 53 శాతం డీఏను కనీస వేతనంలో కలుపుతారా లేదా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే డీఏను కనీస వేతనంలో కలిపితే ఉద్యోగుల జీతం భారీగా పెరుగుతుంది.
7వ వేతన సంఘం ప్రకారం ఏడాదిలో రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఉంటుంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే ఇండెక్స్ ఆధారంగా ఇది నిర్ణయిస్తుంటారు.
ఇప్పుడు మరోసారి డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ జనవరి 2025లో పెంచుతారు. ఆ పెంపు ఎంత ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఏఐపీసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ 4 శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే దీపావళికి ముందు మోదీ ప్రభుత్వం డీఏను 3 శాతం పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నజరానా అందించింది. అటు డీఆర్ కూడా 3 శాతం పెరిగింది. మొత్తం డీఏ 50 శాతం నుంచి 53 శాతానికి చేరుకుంది.