7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!
7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వం నుంచి 7వ వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లకు జీతం పెంపుపై ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈరోజు అక్టోబర్ 9న కేంద్రం ప్రకటిస్తుంది, పండుగ ముందు తీపికబురు అని కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూశారు. కానీ వారి ఆశలు నిరాశగా మారాయి. దీపావళికి ముందు ప్రకటిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.
7వ వేతన సంఘం జీతాల పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ గిఫ్ట్. 4 శాతం డీఏ కేంద్రం పెంచుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో కొన్ని కోట్ల మంది ఉద్యోగులు, పెన్షన్లు లాభం పొందుతారు. ఎందుకంటే డీఏ పెంపుతో వారి జీతం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది.
ఇదిలా ఉండగా దీపావళికి ముందు డీఏ పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దీపావళి ముందు పెంచుతారేమో అని ఆశిస్తున్నారు. ఇది మోదీ ప్రభుత్వం అందిస్తున్న గోల్డెన్ ఆఫర్. డీఏ కనీసం 4 శాతం పెరుగుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న 50 శాతం డీఏ, 54 శాతానికి పెరుగుతుంది. ఉద్యోగుల జీతాలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి.
గత ఏడాది కూడా 2024 మార్చిలో డీఏ 4 శాతం పెంచారు. దీంతో 50 శాతానికి డీఏ చేరింది. అంతకు ముందు 46 శాతం డీఏ ఉండేది. ఈ పెరుగుదలతో వారి జీతాలు కూడా భారీ మొత్తంలో పెరిగాయి. ఒకవేళ ఉద్యోగి జీతం రూ.40000 ఉంటే 4 శాతం డీఏ పెరిగితే రూ. 1600 ప్రతినెలా అదనంగా పొందుతారు. దీంతో వారు ఏడాదికి రూ.19,200 అదనంగా పొందుతారు.
అయితే, డీఏ బకాయిలపై కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు 8వ వేతన సంఘం విషయంలో కూడా కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రతి పదేళ్లకు కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత ఈ ఏడాది కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది అని ఎదురు చూశారు. 2025 లో ప్రస్తుతం ఉన్న వేతన సంఘం కూడా గడువు కూడా ముగియనుంది. కానీ, కొత్త పే కమిషన్ ఏర్పాటు ఆలోచన ఇప్పట్లో లేనట్లేనని కేంద్ర అధికారిక వర్గాలు చెప్పకనే చెప్పాయి. 2026 జనవరి 1వ తేదీన 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈరోజు 7వ వేతన సంఘం డీఏ, డీఆర్ గురించి ప్రకటన చేస్తే 1.15 కోట్లు ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందుతారు.