7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అప్‌డేట్.. 3 శాతం డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!

Wed, 16 Oct 2024-7:43 pm,

ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రం కేబినెట్ బుధవారం డీఏ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఏ పెంపుతో దేశవ్యాప్తంగా కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల భారం పడనుంది.  

జూలై 1వ తేదీ నుంచి పెరిగిన జీతాలను ఉద్యోగులకు అందజేయనున్నారు. అయితే 3 శాతం డీఏ పెరగడంతో తమ జీతం ఎంత పెరుగుతుందోనని చాలా మంది ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు.   

ఉదాహరణకు ఒక ఉద్యోగి నెలవారీ జీతం రూ.30 వేలు అయితే.. బేసిక్ పే రూ. 18 వేలు ఉంటే.. ప్రస్తుతం వారు రూ.9 వేలు డీఏగా అందుకుంటారు. ఇప్పుడు 3 శాతం డీఏ పెంపుతో ఆ ఉద్యోగి జీతం రూ.9,540 అవుతుంది, అంటే నెలకు రూ.540 పెరిగినట్లు అవుతుంది.  

బేసిక్ పే ఎక్కువగా ఉంటే.. డీఏలో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ఆధారంగా కేంద్రం డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే.  

ప్రతి సంవత్సరం జూన్‌లో ముగిసే AICPI ఆధారంగా డీఏ పెంపు నిర్ణయం ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు జీతాల పెంపు ఉండగా.. మొదటి డీఏ జనవరిలో.. రెండో డీఏ జూలై నుంచి అమలు చేస్తారు.   

2006లో డీఏను లెక్కించే సూత్రాన్ని ప్రభుత్వం సవరించింది. డీఏ శాతం = ((ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచీ (ఆధార సంవత్సరం 2001=100) గత 12 నెలల సగటు - 115.76) / 115.76) x 100.  

అయితే కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం ఫార్ములా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. డీఏ శాతం = ((ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచీ సగటు (ఆధార సంవత్సరం 2001=100) గత 3 నెలలు - 126.33) / 126.33) x 100.  

ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెంచగా.. రెండో డీఏను మాత్రం 3 శాతం పెంచారు. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి కేంద్రం జీతాలు పెంచుతోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link