7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..
ప్రతిసారి డియర్‌నెస్ అలవెన్స్ (DA) 50% పెరిగినప్పుడు, పెన్షన్ దారులకు చెల్లించే స్థిరమైన అటెండెంట్ అలవెన్స్ (CAA) కూడా 25% పెరుగుతుందని ఆఫీస్ మెమోరాండమ్‌లో డిపార్ట్‌మెంట్ క్లుప్తంగా తెలిపింది.
DOPPW కొత్త ప్రతిపాదనలో పౌర పెన్షనర్లకు చెల్లించే స్థిరమైన అటెండెంట్ అలవెన్స్ (CAA) ను నెలకు రూ.6750 నుంచి రూ.8438కి పెంచాలని సూచించింది. ఈ నిర్ణయం పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పదవీ విరమణ చేసిన వారికి ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ పౌర పెన్షనర్లు అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి నిర్ణీత కాలం పూర్తి చేసి పదవీ విరమణ చేసిన వ్యక్తులు. వీరు తమ సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి పెన్షన్‌ను పొందుతారు.
కేంద్ర ప్రభుత్వ పౌర పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు లభింస్తాయి. అందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత లేదా తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయాలు, కొన్ని సందర్భాల్లో ఇతర భత్యాలు కూడా లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనిష్ఠ పెన్షన్ నెలకు రూ. 9,000/-గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి పదవీ విరమణ చేసే ప్రతి ఉద్యోగికి కనీసం ఈ మొత్తం పెన్షన్ లభిస్తుంది.
50% డీఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ పెంపు కేవలం జీతాలను మాత్రమే కాకుండా అనేక రకాల అలవెన్సులను కూడా ప్రభావితం చేస్తోంది.
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) అనేది అత్యంత ప్రభావితమయ్యే అలవెన్సులలో ఒకటి. డీఏ పెరుగుదలతో HRA కూడా గణనీయంగా పెరుగుతుంది. కన్వేయన్స్ అలవెన్స్ కూడా ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది.. కాబట్టి, డీఏ పెరుగుదలతో ఈ అలవెన్స్ కూడా పెరుగుతుంది.