DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, మళ్లీ పెరగనున్న డీఏ ఎంత ఎప్పటి నుంచి
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం 2025 ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం దాదాపుగా రెట్టింపు కానుంది. అటు పెన్షన్ కూడా రెట్టింపు అవుతుంది.
గత ఆరు నెలల్లో డీఏ 3 శాతం పెరగగా ఈసారి జనవరి 2025లో డీఏ 4 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. ఏఐసీపీఐ ఇండెక్స్ పెరుగుతుండటం ఇందుకు ఉదాహరణ.
జూన్ నుంచి డిసెంబర్ 2024 వరకూ ఉండే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025లో డీఏ ఎంతనేది ఉంటుంది. ప్రస్తుతం ఇండెక్స్ పెరుగుతోంది. ఈ సూచీ ఆధారంగా డీఏ ఇప్పటి వరకూ 54 శాతానికి చేరుకోవల్సి ఉంది. ప్రస్తుతం అందుకుంటున్న 53 శాతానికి అదనంగా 1 శాతం పెరిగింది. డిసెంబర్ నాటికి ఇది మరో 2-3 శాతం పెరగవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ ఏడాదిలో రెండుసార్లు పెరుగుతుంటుంది. అందుకే 2025 జనవరి డీఏ-డీఆర్ పెంపుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త వచ్చింది. మరో రెండు నెలల్లో డీఏ, డీఆర్ పెరగనుంది. డీఏ, డీఆర్ ఎప్పుడైతే పెరుగుతాయో జీతాలు, పెన్షన్ కూడా భారీగా పెరగనున్నాయి.