7th Pay Commission Updates: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ తొలి గిఫ్ట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!

Wed, 04 Dec 2024-12:58 pm,

బడ్జెట్ 2025‌లో పెండింగ్‌లో 18 నెలల డీఏ, డీఆర్‌కు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.   

కరోనా సమయంలో యావత్ దేశం సంక్షోభం ఎదుర్కొన్న సమయంలో ఉద్యోగుల డీఏ అమౌంట్‌ను సంక్షేమ పథకాలు, పేద ప్రజల సహాయార్థం ఉపయోగించారు.  

కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకున్న తరువాత పెండింగ్ డీఏలను కేంద్రం విడుదల చేస్తుందని ఉద్యోగులు పెట్టుకున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డీఏలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల సంఘాలు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి.  

పెండింగ్ డీఏలు చెల్లించాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారు. కరోనా సమయంలో నిలిపివేసిన డీఏలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు పడతున్నారని అన్నారు.  

ప్రస్తుతం దేశం ఆర్థికంగా పురోగమిస్తోందని.. పెండింగ్ డీఏ, డీఆర్ చెల్లించాలని కోరారు.  

పెండింగ్‌ డీఏలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే రూ.2 లక్షల వరకు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుందని అంటున్నారు.   

మూడు విడతలుగా చెల్లించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నా.. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.   

వచ్చే ఏడాది డీఏ పెంపు, కొత్త పే కమిషన్ ఏర్పాటు, పెండింగ్ డీఏల ప్రకటనల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link