7th Pay Commission DA Hike 2025: కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. జీతాలు భారీగా పెంపు.. కన్ఫార్మ్..!
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53 శాతం డీఏ అందుతోంది. చివరగా దీపావళి పండగ సందర్భంగా 3 శాతం డీఏను పెంచిన విషయం తెలిసిందే.
త్వరలోనే కొత్త ఏడాదిలో మొదటి డీఏ పెంపునకు సంబంధించిన ప్రకటన రానుంది. నవంబర్ AICPI ఇండెక్స్ డేటా రిలీజ్ కాగా.. డిసెంబర్ లెక్కలు రావాల్సి ఉంది.
నవంబర్‌లో ఆల్-ఇండియా CPI-IW 144.5 పాయింట్ల వద్ద ఉంది. డిసెంబర్ నెలకు సంబంధించిన డేటా రిలీజ్ అయితే డీఏ పెంపుపై పూర్తి క్లారిటీ రానుంది.
ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం.. ఉద్యోగులకు మరోసారి 3 శాతం డీఏ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మొత్తం డీఏ 56 శాతానికి చేరనుంది.
ఇక బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రకటన ఉంటుందని ఆశించినా.. నిరాశ ఎదురైంది.
7వ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తికావడంతో ఈసారి కచ్చితంగా ప్రకటన ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. అయితే వేతన సంఘం కాకుండా ప్రైవేట్ సెక్టార్‌లో మాదిరిగా ప్రతి ఏటా జీతాల సవరణ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పర్ఫార్మెన్స్ ఆధారంగా.. ద్రవ్యోల్బణం బట్టి జీతాలు నిర్ణయించే అవకాశం ఉంది. వేతన పెంపును లెక్కించేందుకు ప్రభుత్వం iCreot ఫార్ములాను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.