7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే షాక్.. డీఏ విషయంలో బ్యాడ్‌న్యూస్..!
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గ్రాట్యుటీని పెంచుతోంది. ఈ గ్రాట్యుటీ పెరిగే కొద్దీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతున్నాయి.
త్వరలోనే జూలై 2024 డీఏ పెంపు ప్రకటన ఉండనుంది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు.
ఈ విషయం పక్కనపెడితే.. కోవిడ్ సమయంలో నిలిపేసిన 18 నెలల డీఏ బకాయిలకు సంబంధించిన షాకింగ్ ప్రకటన వైరల్ అవుతోంది.
పెండింగ్ డీఏ చెల్లించడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 18 నెలలపాటు డీఏను ఇవ్వలేదు. పెండింగ్ డీఏను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే కేంద్రం ఎలాంటి గుడ్‌న్యూస్ చెప్పలేదు.