8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. కొత్త పే కమిషన్‌పై బిగ్ అప్‌డేట్
8th Pay Commission Latest Updates: దాదాపు దశాబ్దం క్రితం కేంద్రం 7వ వేతన సంఘం ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఈ ఏడాడి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. ఈ సందర్బంగా ఆర్ధిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటు చేయడం అంతా ఆషామాషీగా జరగలేదన్నారు. 8వ వేతన సంఘం అమలుకు ఇంకా టైమ్ ఉందని పేర్కొన్నారు.
2024-25 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన రెండు రోజుల తర్వాత టీవీ సోమనాథన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 8వ పే కమిషన్ కు ఏర్పాటుకు 2026 జనవరి 1 వరకు గడువు ఉందన్నారు. ప్రస్తుతం మనం 2024లో ఉన్నామని పేర్కొన్నారు.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి సంబంధించి 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ రావడం ఆనవాయితీ వస్తుంది. చివరగా 7వ వేతన సంఘాన్ని ఫిబ్రవరి 2014లో ఏర్పాటు చేయశారన్నారు. దాని సిఫార్సులు 1 జనవరి 2016 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ కౌన్సిల్ (స్టాఫ్ సైడ్), జాయింట్ కన్సల్టేటివ్ మెషినరి (NC -JCM), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్మికుల సంఘం కలిసి బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు సోమనాథన్.
2014లో 7వ వేతన సంఘం ఏర్పాటుతో పాటు అది ప్రకటించిన సమయం కూడా అసాధారణం అన్నారు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సోమనాథన్. 28 ఫిబ్రవరి 2014లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్ లో 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. అదే యేడాది మార్చి 2024 ఎన్నికలకు వెళ్లింది. మధ్యంత బడ్జెట్ సందర్బంగా 7వ వేతన సంఘం ప్రకటన వెలుబడిన విషయాన్ని ప్రస్తావించారు.
ఇంతలోనే.. 2024 బడ్జెట్ ను రెడీ చేయడానికి ఒక రోజు ముందు.. ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి జూలై 22న లోక్ సభకు అడిగిన ప్రశ్నోత్తారాల సమయంలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే 2024లో పే ప్యానెల్ పై రెండు ప్రతిపాదనలు వచ్చిన విషయాన్ని ఆయన ధృవీకరించారు.
8వ వేతన సంఘం ప్రకటన కోసం జూన్ లో కేంద్రానికి లేఖ రాసిన NC - JCM ఈ ఇయర్ సెప్టెంబర్ లోగా కేంద్రం నుంచి ఆశావాహా ప్రకటన వెలుబడుతుందని ఆశిస్తున్నారు. బడ్జెట్‌కు ముందు అప్ స్టాక్స్ తో మాట్లాడిన NC-JCM కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. ప్రభుత్వం జూలై 23న 8వ పే కమిషన్‌ను ప్రకటిస్తే.. స్వాగతించాలనుకున్నాము. కానీ అది జరగలేదు. కానీ సెప్టెంబర్ లోగా మేము 8వ వేతన సంఘంపై కేంద్రం కీలక ప్రకటన చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.
8వ వేతన సంఘంలో ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ జీతాలకు సవరించడానికి 3.68 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను సిఫారసు చేయాలని ప్యానెల్‌ను కోరతామని మిశ్రా ఈ సందర్బగా ప్రస్తావించారు. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే.. కనీస వేతం రూ.26 వేలకు పెరుగుతుంది.