Abhishek Sharma Love Story: టీమ్ ఓనర్‌తోనే అభిషేక్ శర్మ డేటింగ్..? ట్రెండింగ్‌లో ఉన్న ఆమె ఎవరంటే..!
అభిషేక్ శర్మ సెంచరీతో టీ20ల్లో రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తాడని అభిమానులు అంటున్నారు. హిట్‌మ్యాన్ ప్లేస్‌తో అభిషేక్ శర్మ ప్లేస్ ఫిక్స్ అని డిసైడ్ చేస్తున్నారు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరుఫున అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి టీమ్‌కు మెరుపు ఆరంభాలను ఇచ్చాడు.
ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్‌తో అభిషేక్ శర్మ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇతర ఆటగాళ్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కంటే.. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కావ్య మారన్ డేటింగ్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. తామిద్దరం మంచి స్నేహితులమని అనిరుధ్ స్పష్టం చేశారు.
ఆ తరువాత అభిషేక్ శర్మతో డేటింగ్ రూమర్లు తెరపైకి తీసుకువచ్చారు పుకారురాయుళ్లు. అయితే ఇది పూర్తి ఫేక్ న్యూస్ అని క్రికెట్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. అభిషేక్ శర్మ వయసు 23 ఏళ్లు కాగా.. అతని కంటే కావ్య మారన్ వయసు పదేళ్లు ఎక్కువ.
ఇక అభిషేక్ శర్మ నెట్‌వర్త్ దాదాపు రూ.12 కోట్లు అని టాక్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మకు రూ.6.5 కోట్లు చెల్లిస్తోంది.