EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

Mon, 07 Dec 2020-8:00 pm,

EPFO: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులలో దాదాపు అందరికీ ఈపీఎఫ్ ఖాతా ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఖాతాదారులకు పీఎఫ్‌తో పాటు వడ్డీ అందిస్తుంది. ఏ పెట్టుబడి లేకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ సైతం లభిస్తుంది. అయితే కొందరు ఉద్యోగులకు తమ పీఎఫ్ ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసుకోవడం తెలియదు. కారణం ఆ ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) తెలియదండి అని చెప్పడమే ఇందుకు ప్రధాన కారణం. మరి ఆ UAN నెంబర్ ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌కు ఎలా లింక్ చేసుకోవాలో ఇక్కడ పూర్తి వివరాలు మీకోసం..

మీ ప్లే స్లిప్ (Salaryslip or Payslip)లో యూఏఎన్ నెంబర్ ఉంటుంది. అందులో UAN లేకుంటే మీ కంపెనీ హెచ్ఆర్‌ను సంప్రదించాలి. అయితే ప్రతి నెలా మీ జీతం నుంచి పీఎఫ్ కట్ అయ్యే వారికి మాత్రమే ఈ యూఏఎన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీ యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

మొదటగా EPFO వెబ్‌సైట్‌ లింక్ ఓపెన్ చేయాలి. అందులో కుడివైపు  కింది భాగంలో ఓచోట Activate UAN ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

మీ Payslipలో ఉన్న UAN నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు Captcha Text అక్కడ అందించాలి. కీ ఆథరైజేషన్ పిన్ పొందడానికి క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని కాపీ చేసుకోండి.

EPFO వెబ్‌సైట్‌లోని అన్ని వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత ఈ వివరాలకు అంగీకారం తెలుపుతూ పక్కన ఉన్న I Agree చెక్ బాక్స్‌ను టిక్ చేయండి.

మీ ఫోన్‌కు వచ్చిన OTPని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ తరువాత Validate OTP and Activate UAN మీద క్లిక్ చేయండి. ప్రక్రియ పూర్తయింది. 

Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా! 

ఇప్పుడు మీ UAN యాక్టివేట్ అవుతుంది. మరియు మీ మొబైల్ నంబర్‌కు ఓ పాస్‌వర్డ్ వస్తుంది. ఆరు గంటలు తర్వాత మీరు EPFO కు లాగిన్ అయ్యి మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. తొలిసారి కనుక UAN యాక్టివేట్ అయ్యాక 6 గంటలు వేచి చూడక తప్పదు. దీని ద్వారా పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీలో చేరినప్పుడు బదిలీ చేసుకోవచ్చు. అవసరం ఉన్న సమయంలో మీ పీఎఫ్ నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాలు ఉన్నాయి.

Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link