Jr NTR: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకేముంటది

Sat, 31 Aug 2024-5:26 pm,

Jr NTR Udupi Visit: వరుస సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజాగా కుటుంబంతో తీర్థయాత్రకు వెళ్లాడు. 

Jr NTR Udupi Visit: తన తల్లి స్వగ్రామం కర్ణాటకలోని కుదపురకు కుటుంబంతో సహా వెళ్లాడు. అంతేకాకుండా ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి పూజలు చేశాడు.

Jr NTR Udupi Visit: అక్కడకు వెళ్లేందుకు కాంతార హీరో రిషబ్‌ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సహకారం అందించారు. ఎన్టీఆర్‌ పర్యటనలో వారిద్దరూ ఉన్నారు.

Jr NTR Udupi Visit: యాత్రకు తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎన్టీఆర్‌ ఆలయాన్ని సందర్శించాడు.

Jr NTR Udupi Visit: ఆలయంలో రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ నీల్‌ స్వాగతం పలికారు. ప్రత్యేకంగా దర్శనం చేయించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

Jr NTR Udupi Visit: ఉడిపి యాత్ర విశేషాలను ఎన్టీఆర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. 'మా అమ్మ చిరకాల కల అయినా ఆమె స్వగ్రామం కుందపుర, ఉడిపి శ్రీకృష్ణ మఠం సందర్శన తీరిపోయింది. ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 2వ తేదీకి రెండు రోజుల ముందే తీరడంతో ఆమెకు ఇంతకు మించి ఇలాంటి గిఫ్ట్‌ ఏనాడు ఇవ్వలేదు' అని ఎన్టీఆర్‌ పోస్టుచేశారు.

Jr NTR Udupi Visit: 'ఈ అద్భుత క్షణాల్లో భాగమైన నా ప్రియమైన స్నేహితులు నిర్మాత విజయ్‌ కిరణ్‌గందుర్‌, రిషబ్‌ శెట్టి, ప్రశాంత్‌ నీల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు' అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Jr NTR Udupi Visit: ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్‌ జాన్వీ కపూర్‌తో నటించిన దేవర సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link