నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు
![నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు Actor Nithin Wedding Photos Gallery](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/ActorNithinweddingPhotosGallery_0.jpg)
టాలీవుడ్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం రాత్రి జరిగిన నితిన్, షాలిని వివాహ వేడుక ఫొటోలు (Nithin Wedding Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
![నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు Nithin Wedding Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/NithinWeddingPhotos.jpg)
నితిన్, షాలినిలు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ముందుగా నిశ్చయించిన శుభముహూర్తానికి వివాహబంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ పెద్దలు, మిత్రులు నితిన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆశీర్వదిస్తున్నారు.
![Nithin Wedding Photos వైరల్ Nithin Marriage Photos](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/NithinWeddingPhotos9.jpg)
ఏప్రిల్ 16న వివాహాన్ని నిశ్చయించారు. కానీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లలో వాయిదా పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటే కరోనా వల్ల కుదరలేదు.
షాలిని కందుకూరి, నితిన్‌కు ఎనిమిదేళ్లుగా పరిచయం. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న నితిన్, షాలిని తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు.
నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ దంపతులు సంపత్ కుమార్, నూర్జహాన్‌ల కూతురు షాలిని. వాస్తవానికి నితిన్ పెళ్లి పనులు ఫిబ్రవరిలో మొదలయ్యాయి.
నితిన్, షాలిని ఐదు రోజుల పెళ్లి వేడుక జులై 22న వీరి నిశ్చితార్థంతో మొదలైంది. ఆ తర్వాత పెళ్లి పనులు చేస్తూనే మెహందీ, సంగీత్ ఫంక్షన్ నిర్వహించారు.
తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, సినీ పరిశ్రమ నుంచి యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు నితిన్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
Nithin Shalini Wedding Photos
Images Source: ఈ ఫొటోలను నితిన్ ఫ్యాన్స్, ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లలో పోస్ట్ చేశారు.