Sai Kiran: రెండో పెళ్లికి సిద్ధమైన సాయి కిరణ్.. ఏకంగా వదినతో..?

ప్రముఖ స్టార్ నటుడు సాయికిరణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, ఇందులో కీలక పాత్ర పోషించారు సాయికిరణ్.

ఈ సినిమాలో "అనగనగా ఆకాశం ఉంది" అనే పాటతో భారీ పాపులారిటీ లభించింది. ముఖ్యంగా ఈ పాట ఎక్కడ వినిపించినా ఈయనే గుర్తుకొస్తారు. తర్వాత డార్లింగ్ డార్లింగ్, జగపతి, గోపి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. కానీ అన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో తనకు ఆఫర్లు తగ్గుముఖం పట్టడంతో సీరియల్స్ లోకి వెళ్లిపోయారు.

2010లో వైష్ణవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సాయికిరణ్ కి ఒక పాప కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లే విడిపోయారని సమాచారం.
ఇకపోతే ఈయన రెండోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కోయిలమ్మ సీరియల్లో తనతో పాటు నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నారు సాయికిరణ్. ఈ సీరియల్లో స్రవంతి సాయికిరణ్ కు వదిన గా నటించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి నిశ్చితార్థపు ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.