Siva Balaji: విడాకులకు సిద్ధమైన శివబాలాజీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన భార్య..!
మాటీవీలో వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వన్ లో పాల్గొని విజేతగా నిలిచారు. 2009లో స్నేహితురాలు, ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో నటించిన తన సహ నటి అయిన మధుమితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు.
మధుమిత కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ముఖ్యంగా పుట్టింటికి రా చెల్లి మన్మధుడు లాంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె ఇప్పటికీ కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.
తెలుగు, తమిళ్లో నటిస్తున్న ఈమె శివ బాలాజీ వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఇంటి జీవితానికి పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వీరిద్దరి విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు రాగా దీనిపై మధుమిత కామెంట్ చేసింది.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు విడాకులపై స్పందించారు. పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు పెళ్లి తర్వాత గొడవలు పడ్డారు. ముఖ్యంగా మొదటి బాబు పుట్టినప్పుడు చిన్న చిన్న గొడవలు కారణంగా మధుమిత పుట్టింటికి వెళ్ళగా శివ బాలాజీ తన కజిన్స్ దగ్గరికి వెళ్లేవారట.
ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటే విడాకులు ఇస్తానని బెదిరించాడట శివ బాలాజీ. అయితే తన భర్త తనని విడిచి ఉండలేడని తెలుసుకున్న ఈమె సరే అని చెప్పిందట . ఇక తన భార్య ఎక్కడ దూరం అవుతుందో అనుకున్న శివబాలాజీ అప్పటినుంచి తన భార్యతో కలిసి ఉన్నట్లు సమాచారం.