Amala Paul: అమలాపాల్ జలకాలాట.. కొలనులో మతిపోగొట్టే పోజులు
1991 అక్టోబరు 26న కేరళలోని ఎర్నాకుళంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు అమలాపాల్. అమలా పాల్ అసలు పేరు అనఖ.
కోచిలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేయగా.. ప్రముఖ మలయాళ డైరెక్టర్ లాల్ జోస్ రూపొందించిన 'నీల తామర' సినిమాతో తెరంగేట్రం చేశారు.
'మైనా' (తెలుగులో ప్రేమ ఖైదీ) సినిమాతో అమలాపాల్‌కు భారీ క్రేజ్ వచ్చింది. ఇందులో మైన.. మైన.. అంటూ సాగే పాటలో అమలాపాల్ ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానులు ఫిదా అయిపోయారు.
ఈ సినిమా సూపర్ హిట్‌తో భారీగా అవకాశాలు క్యూకట్టాయి. తెలుగులో రామ్‌చరణ్ సరసన 'నాయక్' మూవీలో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది.
తాజాగా మహాశివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా ఇడోనేషియాలోని బాలిలో ఉన్న హిందూ దేవాలయాన్ని సందర్శించారు అమలాపాల్. అక్కడే కొలనులో సాన్నం చేస్తూ.. ఫొటోలలకు స్టిల్స్ ఇచ్చింది.