Anushka: అనుష్క కి పేరు పెట్టింది నాగార్జుననే.. ఎలా జరిగిందంటే..!

Mon, 07 Oct 2024-11:54 am,

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు..పరిచయమైంది అనుష్క శెట్టి.  మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. ఆ తరువాత తెలుగులో వరసగా సినిమాలతో బిజీ అయిపోయింది. 

ముఖ్యంగా అరుంధతి చిత్రంతో.. స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ను ఈ హీరోయిన్ తెచ్చిపెట్టుకుంది. అప్పట్లో స్టార్ హీరోలకు సమానమైన హీరోయిన్ ఎవరు అంటే.. అందరూ అనుష్క పేరే చెప్పేవారు. అంతలా క్రేజ్ తెచ్చుకుంది ఈ హీరోయిన్.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు తక్కువ చేస్తున్నా కానీ.. అనుష్కకి తెలుగులో అభిమానులు మాత్రం ఎక్కువే. అంతేకాకుండా ఈ అమ్మడుని మనవాళ్లందరూ స్వీటీ అని పిలుచుకుంటారు. 

అయితే స్వీటీ అనేది అనుష్క ముద్దు పేరు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అనుష్క నిజం పేరు స్వీటీ. అవును మీరు విన్నది నిజమే. ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక ఈవెంట్ లో సూపర్ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ..”సూపర్ సినిమాకి అనుష్క ని తీసుకున్నప్పుడు తన పేరేంటి అని అడిగాము.. స్వీటీ అని చెప్పింది. అసలు పేరు ఏమిటి అని అడిగితే.. స్వీటీ అని చెప్పింది. స్వీటీ అనేది ముద్దు పేరు కదా.. ఇలా హీరోయిన్ కి ఆ పేరు ప్రతి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండదు అనుకున్నాము. అప్పుడు ఒక పాట పాడడానికి ఒక సింగర్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు అనుష్క. ఆ పేరు వినగానే నాగార్జున.. ఈ అమ్మాయికి ఆ పేరే పెట్టేద్దాము. ఆ పేరుతో ఇప్పుడు వరకు ఏ హీరోయిన్ లేదు అని చెప్పారు. ఇక అప్పటినుంచి అనుష్క అని పిలవడం మొదలు పెట్టాము.” అని చెప్పుకొచ్చారు. 

మొత్తానికి అనుష్కకి పేరు పెట్టింది.. మన నాగార్జుననే. ఒకవేళ అప్పుడు నాగార్జున అనుష్క అని పేరు పెట్టి ఉండకపోతే.. మన స్వీటీ అసలు పేరు ఇప్పటికీ స్వీటీనే అయ్యుంటది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link