Chandrika Ravi: బాలయ్య భామ రేర్ ఫీట్.. తొలి ఇండియన్ నటిగా..!

Wed, 05 Jun 2024-7:19 pm,

భారతీయ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి చంద్రికా రవి..  ఈ టాక్ షో ద్వారా తన జీవితంలో జరిగిన సంఘటనలు, అనుభవాలను పంచుకోనున్నారు.   

రుకుస్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్.. ఈ బ్యూటీకి హోస్ట్‌గా ఆఫర్ ఇచ్చారు.  

తనకు సొంతంగా ఓ టాక్ షో నిర్వహించాలని ఎప్పటి నుంచో కోరిక ఉందని.. ఇప్పుడు నెరవేరిందన్నారు చంద్రికా రవి. ఆమె ఈ కార్యక్రమం ప్రతి అంశంతో పాటు దాని రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  

ఇది ఒక గొప్ప అనుభవం అని.. కొంచెం ఒత్తిడి ఉన్నా కానీ లాభదాయకంగా ఉందని చంద్రికా రవి అన్నారు. కెమెరా వెనుక నుంచి పనిచేయడం భిన్నంగా ఉందన్నారు.  

సినీ కెరీర్ ఆరంభించకముందు ఆమె రేడియో, టెలివిజన్‌లో అనేక లైవ్ షోలను హోస్ట్ చేసింది. యూఎస్‌లో రేడియో షోను హోస్ట్ చేసిన మొదటి భారతీయ మహిళ అని తాను కావచ్చని.. కానీ తానే చివర కాదని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

చంద్రిక షో యూఎస్‌లోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటైన iHeart రేడియో, రుకస్ అవెన్యూ రేడియోలో ప్రతి గురువారం ఉదయం 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రసారం అవుతోంది. ఫుల్ ఎపిసోడ్ ప్రతి శుక్రవారం యూట్యూబ్‌లో రిలీజ్ అవుతుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link