Kajal Aggarwal: బేబి బంప్ ఫోటోను పంచుకున్న కాజల్ అగర్వాల్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Sat, 09 Apr 2022-8:46 pm,

కాజల్ అగర్వాల్ మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మే నెలలో తన డెలవరీ ఉంటుందని ఇప్పటికే కాజల్ సోషల్ మీడియా ద్వారా చెప్పారు.

తన హెల్త్ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే కాజల్.. తాజాగా మాతృత్వ అనుభవాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మన పిల్లలను, జీవిత భాగస్వాములను ప్రేమిస్తున్నప్పుడు ఈ భావోద్వేగపు బంధంలో మనల్ని మనం మర్చిపోతుంటాం అని చందమామ పేర్కొన్నారు. 

ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపరవేత్త గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న చందమామ.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ తన ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.  

తమిళంలో కూడా దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ కాజల్‌ అగర్వాల్ సినిమాలు చేశారు. బాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని ట్రై చేసినా.. సక్సెస్ కాలేకపోయారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోయిన్ అనే చెప్పాలి.

కాజల్‌ అగర్వాల్.. పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. మగథీర చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయారు. అప్పటి నుండీ కాజల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link