Pooja Hegde Pics: ముంబై వీధుల్లో పూజా హెగ్డే.. మేకప్ లేని బుట్టబొమ్మ పిక్స్ వైరల్!
తాజాగా పూజా హెగ్దే ముంబైలో చక్కర్లు కొట్టారు. సముద్రంలో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. మేకప్ లేని బుట్టబొమ్మ పిక్స్ వైరల్ ఆవూట్నాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే నిత్యం హాట్ హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. బుట్టబొమ్మ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.
పూజా హెగ్డే చివరగా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు నిరాశే మిగిల్చాయి. వరుస డిజాస్టర్స్ పడినా పూజాకు అవకాశాలు తగ్గడం లేదు. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తున్నారు.
ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజాకు మంచి పేరు వచ్చింది.
2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో వచ్చిన 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
1990 అక్టోబరు 13న ముంబైలో పూజా హెగ్డే జన్మించారు. శ్రీమతి ఎంఎంకే కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో పూజా రెండో స్థానంలో నిలిచారు.