Pragya jaiswal: ప్రముఖ క్రికెటర్ తో ప్రగ్యా జైస్వాల్ పెళ్లి ..? ఎవరంటే..?
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ హీరోయిన్. మొదటి చిత్రం మంచి విజయం సాధించడంతో.. ప్రగ్యాకు వరస అవకాశాలు వచ్చాయి.
కానీ ఆ తరువాత ప్రగ్యా తెలుగులో నటించిన.. ఏ చిత్రం కూడా అంతటి విజయం సాధించలేకపోయింది. నాగార్జునతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రగ్యా జైస్వాల్ నటించిన.. ఓం నమో వెంకటేశాయ కూడా ఆమెకు విజయం తెచ్చి పెట్టలేకపోయింది.
అయితే ఈ మధ్య బాలకృష్ణతో చేసిన అఖండ సినిమా మాత్రం.. మరలా ప్రగ్యా కు మంచి విజయం అందించింది. కానీ ఈ సినిమా తరువాత కూడా ఈ అమ్మడుకి తెలుగులో అనుకుందని అవకాశాలు మాత్రం రాలేదు.
ఇక త్వరలోనే అఖండ సినిమాకి సీక్వెల్ గా రానున్న అఖండ 2లో కనిపించనుంది. మరోపక్క హిందీ సినిమాలలో, హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ప్రగ్యాజేశ్వర్ ప్రముఖ క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్టు తెగ వార్తల వినిపిస్తున్నాయి.
ప్రగ్యా జైస్వాల్.. ప్రముఖ క్రికెటర్.. శుభ్‌మన్ గిల్‌తో ప్రేమలో ఉన్నట్లు.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కిబోతున్నట్టు.. తెగ వార్తలు వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా.. ఈ హీరోయిన్ కి సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ కూడా వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో.. మీరు క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తో ప్రేమలో పడే అవకాశం ఉందా అని అడగగా.. అతను చాలా క్యూట్ గా ఉంటారు.. ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పగలం. రాసిపెట్టిందే జరుగుతోంది. ఒకవేళ నిజంగా మేము కలవాలి అని రాసి ఉంటే అది జరుగుతుంది,” అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఇంటర్వ్యూస్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరి ప్రేమ, పెళ్లి వార్త కేవలం రూమర్ అని ఎంతోమంది కొట్టి పడేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ఇప్పటికే ఈ క్రికెటర్ తో ఎంతోమంది హీరోయిన్స్ ప్రేమలో పడినట్లు వార్తలు రావడం. ఈ వార్తలో నిజం ఏంటో తెలియాలి అంతే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.