Raasi: పిల్లల తండ్రి అయిన తెలుగు స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్న రాశి.. ఇదెక్కడి విడ్డూరం..!

Tue, 05 Nov 2024-4:49 pm,

ఒకప్పుడు చాలామంది సీనియర్ స్టార్ హీరోలతో కలసి జతకట్టిన రాశి , ఆ తర్వాత యంగ్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది.  అంతేకాదు ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు బుల్లితెర షోలలో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. 

సాంప్రదాయానికి నిలువెత్తు రూపం అయిన రాశి గ్లామర్ పాత్రలకు చాలా దూరంగానే ఉండింది.  ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ సమయంలో ఈమె తల్లిదండ్రులు మద్రాస్ లో వాహిని స్టూడియో పక్కనే టీ దుకాణం నడిపే వారట. 

అలా ఎంతోమంది నటులు,  దర్శకులు పరిచయమయ్యారు.  చిన్నతనంలోనే క్యూట్ గా ఉండడంతో రాశిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపిక చేసుకున్నారు. ఇక తర్వాత హీరోయిన్గా మారి ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. 

ఇకపోతే ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచే ఒక ఫాంటసీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి హీరోయిన్ కావాలని , డాక్టర్ కావాలని , కలెక్టర్ కావాలని .. ఇలా ఏం కావాలన్నా సరే అందుకు తగ్గట్టుగా దారులు ఏర్పరుచుకోవాలి. అయితే రాశి మాత్రం మంచి భార్య కావాలని కోరుకునేదట.   

అయితే ఈమెకు చిన్నప్పటినుంచి వెంకటేష్ అంటే చాలా ఇష్టమట.  అతడినే పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాం అని కూడా అనుకుంది.  అయితే ఈ విషయంపై ఇంట్లో గొడవ కూడా జరిగిందట. కానీ అప్పటికే వెంకటేష్ కి పెళ్లి అయ్యి,  పిల్లలు ఉండడంతో సరిపెట్టుకుందట రాశి , ఆ తర్వాత రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుంటానని కూడా రచ్చ చేసిందట. అదీ కుదరక చివరికి డైరెక్టర్ శ్రీమునిని  ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్, సీరియల్స్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తోంది హీరోయిన్ రాశి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link