Rashmika Mandanna::రష్మిక ఆహారపు అలవాటు ఏంటో తెలిస్తే.. వాంతులు రావడం ఖాయం..!

Sat, 19 Oct 2024-8:05 am,

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ తమిళ్, తెలుగు, హిందీ భాషలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే రష్మిక ఆహారపు అలవాట్లు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో..ఆమె ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకొని,, వాంతులు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. మరి రష్మిక ఫుడ్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 

తన ఆహారపు అలవాట్లను స్వయంగా రష్మిక.. గతంలో.. 2020లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో..అభిమానులతో పంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచింది. ‘నేను కర్ణాటకలోని కోర్గీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని. చిన్నప్పటినుంచి పంది మాంసం తినడం అలవాటు. ఏదైనా పండుగ వచ్చినప్పుడు పంది మాంసం మేము నిప్పుల మీద వేడి చేసి దానిని తింటాము. అంతేకాదు ఆరోజు మా ఇంట్లో వైన్ కూడా తయారు చేసుకుని తాగుతాము’. 

అలా వేడి వేడి పంది మాంసపు వేపుడులోకి వైన్ కూడా కలిపి తాగితే ఆరోజు హాయిగా నిద్ర పడుతుంది. ఇలా మితంగా పంది మాంసంతో పాటు వైన్ ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది అంటూ తెలిపింది. 

అంతేకాదు  పండుగలు వచ్చిన ప్రతిసారి కూడా  ఖచ్చితంగా మేము ఇదే ఫాలో అవుతాము అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ కాస్త వైరల్ అవ్వడంతో ఇది చూసిన చాలామంది నెటిజన్లు వామిటింగ్ ఏమోజీ ను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link