Samantha: నాగచైతన్య ఇంట్లోనే కాదు.. సమంత ఇంట్లో కూడా మొదలైన పెళ్లి సంబరాలు..!
నాగచైతన్యని పెళ్లి చేసుకున్న సమంత.. ఆ తరువాత కొన్ని కారణాలవల్ల నాగచైతన్యతో.. విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత నుంచి సమంతా. మల్లి పెళ్లి చేసుకుంటుందా.. లేదా..? అని అనుమానం ఎంతోమందిలో వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్యనే నాగచైతన్యకి.. శోభిత దూళిపాదాతో నిశ్చితార్థం జరగాగా…మరి సమంత కూడా త్వరలోనే ఎవరినన్నా నిశ్చితార్థం చేసుకుంటుందా అని.. సినీ ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాజాగా సమంత ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగాయి. అయితే సమంత పెళ్లి కోసం అనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే. ఇది సమంత పెళ్లి కోసం కాదు..సమంత సోదరుడి పెళ్లి కోసం. ఇక ఈ పెళ్లి కోసం సమంత ఫ్యామిలీ మొత్తం.. అమెరికాకు వెళ్లి మరి డెస్టినేషన్ వెడ్డింగ్ రంగ రంగ వైభవంగా జరిపారు.
ఇక ఈ పెళ్లిలో తెగ హడావిడి చేసింది సమంత. తన తల్లితో అలానే తన సోదరిడితో సమంత దిగిన ఫోటోలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఎర్ర డ్రస్సు వేసుకొని సమంత చాలా అందంగా కనిపించింది.
ఇక ముఖ్యంగా సమంత తన తల్లితో దిగిన ఫోటోలు ఆమె అభిమానులను.. తెగ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈమధ్య వరకు సమంతకి..సమంత ఫ్యామిలీకి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి అనే మాటలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ ఫోటోలు చూస్తే అవి అన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని..సమంత తన ఫ్యామిలీతో ఎంతో హ్యాపీగా ఉందని తెలుస్తోంది
ఇక సినిమాల పరంగా తీసుకుంటే విజయ దేవరకొండ ఖుషి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న సమంత.. త్వరలోనే తన సొంత నిర్మాణ సంస్థలో రామన్న మా ఇంటి బంగారం అనే చిత్రంలో కనిపించనుంది. వీటితో పాటు కొన్ని హిందీ సినిమాలు కూడా అంగీకరించింది సమంత.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సమంత కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం.. అభిమానుల మడిలో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయం గురించి తెలియాలి అంతే మాత్రం సమంత స్పందించాలి.