Samantha: ప్రేమపై సమంత షాకింగ్ కీలక వ్యాఖ్యలు వైరల్..!

Sat, 02 Nov 2024-6:16 pm,

సౌత్ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరోయిన్ గా.. పేరు సొంతం చేసుకున్న సమంత వెండితెరపై కనిపించి సంవత్సరం దాటిపోయింది. అయినా సరే ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఒకవైపు భర్త నుంచి విడాకులు.. ఇంకొకవైపు అనారోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇప్పుడిప్పుడే తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.   

గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న.. సమంత,  తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటోంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ గా కనిపిస్తూ అందాలకు తెరలేపింది ఈ ముద్దుగుమ్మ. 

తాజాగా బోల్డ్ షో తో రెచ్చిపోతోంది. చిన్ని చిన్ని డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ తో  అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం తాజాగా హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన.. ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో వరుణ్ దావన్ తో  పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతుంది. 

అంతేకాదు ఇందులో సమంత బోల్డ్ గా కనిపించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  ట్రైలర్ లో లిప్ లాక్  సన్నివేషాలు ఉన్నట్లు కూడా చూపించారు. ఇదిలా ఉండగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మరో పోస్ట్ ని పంచుకుంది సమంత. ఆ పోస్టులో ప్రేమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపింది.   

“మిమ్మల్ని మానసికంగా ఉద్ధరించి, వ్యక్తిగతంగా మిమ్మల్ని సుసంపన్నం చేసే ప్రేమ..గౌరవం మీ చుట్టూ ఉండే ప్రదేశంలో.. ఉండడం ప్రతిరోజు ఒక వేడుకలా అనిపిస్తుంది. ఈ దీపావళి రోజున నేను ప్రతిదానిని పొందాను. అందుకే ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ప్రతి ఒక్కరికి ప్రేమతో నిండిన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను,” అంటూ సమంత తెలిపింది. ఇక సమంత ప్రేమ గురించి షేర్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతూ.. అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link