Simran: ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్న సిమ్రాన్.. మధ్యలోనే ఆగిపోవడానికి కారణం?
ప్రముఖ హీరో అబ్బాస్ మంచి సక్సెస్ అందుకున్న సమయంలో ఎప్పుడూ అతడిని చూడడానికి కనీసం ఒక 20 మంది అమ్మాయిలు అయినా వచ్చేవారట. అంతలా అమ్మాయిల మనసు దోచుకున్నారు అబ్బాస్. అదే సమయంలో సిమ్రాన్ - అబ్బాస్ కలసి తమిళంలో పూచూడవా చిత్రంలో మొదటిసారి కలిసి నటించారు. ఈ సినిమాతోనే సిమ్రాన్ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమగా మారిందని పుకార్లు కూడా వినిపించాయి.
ఒక రకంగా చెప్పాలంటే పూచూడవా చిత్రం ఒక క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా రియాలిటీ గా అనిపించడంతో బయట కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఈ సినిమా హిట్ అవడంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. అందుకే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బలంగా వినిపించిన విషయం తెలిసిందే.
మరొకవైపు అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కదా ఇంకొంత కాలం సినిమాలు చేసే అవకాశం ఉందని కూడా రూమర్స్ క్రియేట్ చేశారు. అలా ఆ రూమర్స్ మధ్య వీరిద్దరూ కలిసి విఐపి అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎవరికి వారు కెరియర్ ను డిసైడ్ చేసుకోవడం మొదలుపెట్టారు.
ఒకవైపు తెలుగులోకి వచ్చేసిన సిమ్రాన్ బాలకృష్ణ, మహేష్ బాబు , హరికృష్ణ లాంటి పెద్ద హీరోలతో నటించింది. అదే సమయంలో అబ్బాస్ మాత్రం సినిమాలు చేసినా ఆయన కెరీర్ కు ప్లస్ కాలేదు. దీనికి తోడు సిమ్రాన్ కెరియర్ పీక్స్ కి వెళ్ళిపోయింది.
మరొకవైపు వరుస సినిమాలు చేస్తూ సిమ్రాన్ ఎంత క్రేజ్ అయితే దక్కించుకుందో.. అటువైపు అబ్బాస్ కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ కారణంగానే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని, అందుకే వీరు వివాహం చేసుకోలేదని పుకార్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.