Soundarya: సౌందర్య మరణం వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి సీనియర్ హీరోయిన్ సావిత్రి తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సౌందర్య మాత్రమే. కట్టు బొట్టుతో మన ఇంటి ఆడపిల్లలా అందరిని ఆకట్టుకుంది. కర్ణాటక ఇండస్ట్రీకి చెందిన ఆమె అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈమెను ఓన్ చేసుకున్నారు అంటే తెలుగు ప్రేక్షకులు ఈమెను ఎంతలా ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అయితే 28 సంవత్సరాల వయసులో హీరోయిన్ గా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే అర్ధాంతరంగా మరణించి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే నేడు మన మధ్య లేకపోయినా ఎంతోమంది ఈమెను ఆరాధ్య దేవతగా భావిస్తున్నారు. ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ ఈమె కావడం గమనార్హం. దీనికి తోడు చాలా సినిమాలలో ఈమె ఫోటోలు కూడా ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు అంటే ఇక ఈమె రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
1993లో మనవరాలి పెళ్లి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సౌందర్య, ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ ఎక్కువగా తెలుగులో వెంకటేష్, జగపతిబాబు సరసన నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే ఒకానొక సమయంలో సినిమాలలో అవకాశాలు తగ్గడంతో రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని భావించిన ఈమె అందులో భాగంగానే బిజెపిలో చేరింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాలలో ప్రచారం చేయాలని కూడా అనుకుంది.
అలా బెంగళూరు నుండి కరీంనగర్ కు వెళ్లే క్రమంలో విమాన ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది సౌందర్య. సౌందర్య తో పాటు ఆమె బ్రదర్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. అయితే ఈమె మరణానికి కారణం మోహన్ బాబు అంటూ ప్రముఖ దర్శకుడు కాపుగంటి రాజేంద్ర ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
సౌందర్య చివరి సినిమా శివశంకర్.. ఇందులో హీరోగా మోహన్ బాబు నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర. ఆయన మాట్లాడుతూ మోహన్ బాబు సాధారణంగా సినిమా షూటింగ్ అప్పుడు ఎవరికి హాలిడే ఇవ్వరు. కానీ సౌందర్య కి మాత్రం బిజెపి పార్టీ ప్రచార సభలో.. పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు. ఒకవేళ సౌందర్యకు ఆయన సెలవు ఇవ్వకపోయి ఉండి ఉంటే.. నేడు ఆమె మరణించేవారు కాదు అంటూ అసలు విషయాన్ని తెలిపారు డైరెక్టర్. ప్రస్తుతం డైరెక్టర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.