Deepawali Lucky Zodiac Sings: దీపావళి తర్వాత ఈ మూడు రాశుల వారి జీవితంలో అనుకోని అదృష్టం.. లక్ష్మీ దేవి అనుగ్రహంతో డబ్బే డబ్బు..
Deepawali:దీపావళి తర్వాత నవంబర్ 16 వ తేది తర్వాత సూర్య భగవాడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గ్రహాల రాజు సూర్య భగవానుడు సంక్రమణంతో ఈ మూడు రాశుల వారికీ అనుకోని లాభం కలగనుంది.
సింహ రాశి..
సూర్యుడు వృశ్చిక రాశి సంక్రమణం నేపథ్యంలో ఈ రాశి వారికీ అనుకోని లాభాలను కలుగజేయనుంది. అంతేకాదు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికీ కలిసొస్తుందనే చెప్పాలి. దైవ సంబంధం కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. కొత్త వ్యాపారం చేయడానికి ఇది అనుకూలమైన సమయం.గత కొంత కాలంగా పెండింగ్ లో ఉంటే.. విజయం సాధించవచ్చని చెప్పొచ్చు.
వృషభ రాశి.. సూర్యుడి వృశ్చిక రాశి మార్పు వలన వృషభ రాశి వారికి అనుకోని లాభాలను కలగజేస్తోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డబ్బులు చేతికి అందుతుంది. వ్యాపారులస్థులకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో దాన్ని తిరిగి పొందవచ్చు. ఆగిపోయిన వ్యాపార ఒప్పందాలు ఖరారు అవుతాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అంది పుచ్చుకుంటారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి సూర్య సంక్రమణం వలన అనుకోని లాభాలు అందుకుంటారు. ఆర్ధికంగా పరిస్థితులు చక్కబెడతాయి. ఆకస్మికంగా ధనలాభం కలగుతుంది. ధీర్ఘ కాలిక వ్యాధుల నుంచి బయట పడతారు. చేసే ఉద్యోగం ప్రమోషన్ అందుకుంటారు. చేసే పనిలో విజయం అందుకుంటారు.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్, జ్యోతిష్యులు ప్రస్తావించిన అంశాలనే మేము ఇక్కడ సమాచారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.