Aghori Naga Sadhu: పోలీసులు చంపడానికి చూస్తున్నారు..?.. బాంబు పేల్చిన అఘోరీ.. అసలేం జరిగిందంటే..?

Fri, 08 Nov 2024-2:10 pm,

ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసం తర్వాత లేడీ అఘోరీ వార్తలలో నిలిచింది. తెలంగాణలో దీపావళి రోజున ఆత్మర్పాణం చేసుకుంటానని రెచ్చిపోయింది. సనాతన ధర్మం కోసం ఎంత దూరమైన వెళ్తానంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఘోరీ నాగ సాధు మాత మాత్రం..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు. ఇటీవల శ్రీకాళ హస్తిలో ఆమె ఆలయం బైట పెట్రోల్ పోసుకుని ఆత్మర్పాణం కోసం రెడీ అయిపోయింది.  

కొంత సేపు అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆమెను మళ్లీ బట్టలు వేయించి, ఆలయంకు తీసుకెళ్లారు. అంతే కాకుండా.. ప్రస్తుతం ఏపీ పోలీసులు నిన్న రాత్రి అఘోరీని కారులో ఇతర చోటకు పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తొంది.  

అఘోరీ వెళ్లే మార్గంలో శ్రీ కాళ హస్తిలో రొడ్డు మీద లైట్లు లేవు. దీంతో అఘోరీ కారు ఒక్కసారిగా రోడ్డు మీద ఎడమ వైపు డివైడర్ లను ఢీకొంది. దీంతో పోలీసులు ఆమెను వెంటనే అక్కడి నుంచి ఆమె కారును పక్కకు తీసుకెళ్లారు.  

కొంత మంది పోలీసులు తనను చంపేందుకు ప్లాన్ లు చేస్తున్నారని, వీరి తొందరపాటు వల్లే తన కారు దెబ్బతిందని కూడా అఘోరీ ఒక వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తొంది. అందుకే తన కారు దెబ్బతిందని చెప్పుకొచ్చింది.  

సనాతన ధర్మం కోసం ఎంతదూరమైన వెళ్తానని, తనను స్మశానంలోకి, ఆలయంలోకి వెళ్లేటప్పుడు అడ్డుపడితే ఆత్మర్పణం చేసుకుంటానని కూడా  అఘోరీ నాగ సాధు స్పష్టం చేసినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం అఘోరీ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link