Agori Escaped From Accident: అఘోరీకి తప్పిన ప్రమాదం.. కారు టైర్ బ్లాస్ట్, కేథార్‌నాథ్ వెళ్తుండగా ఏం జరిగిందంటే?
అఘోరీ మాత తీవ్ర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిన్న మధ్యాహ్నం జీ తెలుగు న్యూస్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన అఘోరీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావడానికి కేథార్‌నాథ్ బయలుదేరారు.
అఘోరీ సొంతంగా వాహనాన్ని నడుపుతారు. నిరంతరం తెలంగాణ నుంచి కేథార్ నాథ్‌కు వాహనం నడుపుతుండటంతో కారు టైర్ బ్లాస్ట్ అయింది. కారు టైరు గాలి పూర్తిగా దిగిపోయినా గమనించకుండా పది కిలోమీటర్లు అలాగే ప్రయాణించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
డెహ్రాడూన్ పరిసరా ప్రాంతాలకు చేరుకోగానే కారు టైరు పూర్తిగా పాడై బ్లాస్ట్ అయింది. దీంతో తనకు తెలిసిన భక్తులకు అఘోరీ సమాచారం అందించింది. దీంతో వారు కొత్త కారు టైరు తీసుకువచ్చి బిగించారు. తిరిగి అఘోరీ కేథార్‌నాథ్ ప్రయాణం మొదలు పెట్టారు.
కేథార్‌నాథ్ రోడ్లు ఘాట్స్ అందుకే ఇలా కారు టైరు నుంచి గాలి పూర్తిగా దిగిపోయింది. రాత్రంతా ఆ ఘాట్ రోడ్లలో నిరంతరం బ్రేక్ లేకుండా కారు నడపడంతో ఇలా జరిగింది. అయితే, తనకు ఏ ప్రమాదం జరగలేదని, ఇంకాస్త దూరం ప్రయాణించి ఉంటే పరిస్థితి చేయి దాటేదని అఘోరీ చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా అఘోరీ ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాను అఘోరీ కాదు అని శ్రీనివాస్ అని ట్రాన్స్‌జెండర్ అని వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు అఘోరీ గ్రామస్థులను, తల్లిదండ్రులను కొన్ని టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.