Viral news: పెళ్లయిన 40 రోజుల్లో ఆరుసార్లే ఆ పని .. భరించలేని భార్య ఏంచేసిందో తెలుసా..?
కొంత మంది సమాజంలో.. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని బజారున పడేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. భార్యకు వంట రాలేదని, చీరకట్టుకొవడంరాలేదని గొడవలు పడుతున్నారు. మరికొందరు తమ భర్త సంపాదన అంతంత మాత్రమే అని కామెంట్లు చేస్తున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లగానే మరో ఎఫైర్ లు పెట్టుకుని విడాకుల వరకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. ఒక మహిళ పెళ్లైన 40 రోజులకే తన భర్తకు విడాకులు ఇచ్చింది. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే మాత్రంషాక్ అవ్వడం పక్కా అని చెప్పవచ్చు.
ఆగ్రాలో ఉంటున్న ఒక మహిళలకు 40 రోజుల క్రితం పెళ్లైంది. దీంతో కొత్త ఇంటికి వచ్చిన సదరు మహిళలకు తన భర్త ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బైటపడ్డాయి. సదరు బాధిత మహిళ స్నానం చేయకుండా అలానే ఉండేవాడు. స్నానం చేయమంటే.. కేవలం గంగా జలం తీసుకుని శరీరంపై వేసుకుని స్నానం అయిపోయిందని, శుధ్ది అయిపోయానని చెప్పేవాడు.
దీంతో సదరు మహిళ మాత్రం విసిగిపోయింది. ఆమె గొడవకు దిగడంతో.. పెళ్లైన 40 రోజుల్లో కేవలం అతి బలవంతంగా 6 సార్లు మాత్రం స్నానంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక తనతో కాదని కూడా.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాకుండా.. తనకు విడాకులు కావాలని, తన భర్త రోజు వేధిస్తున్నాడని కూడా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వీరికి కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు.
కానీ సదరు మహిళ మాత్రం.. గంగా జలంఅంటూ.. తనదగ్గరికి స్నానంచేయకుండానే భర్త వస్తున్నాడని, అతని శరీరం నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నట్లు కూడా మహిళ పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. ప్రతిరోజు తనను వేధింపులకు కూడా పాల్పడ్డాడంటూ మహిళ చెప్పుకొచ్చింది.
దీంతో ఖంగుతిన్న పోలీసులు.. రాజేష్ ను అతని కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ కు రప్పించారు. పోలీసులతో చర్చించిన తర్వాత, రాజేష్ తన అలవాట్లు మార్చుకుంటానని కూడాచెప్పాడు. కానీ అతని భార్య మాత్రం.. తిరిగి ఆ ఇంటికి వెళ్లేదిలేదని కూడా తెల్చిచెప్పింది. ఈ క్రమంలో.. పోలీసులు వీరికి.. సెప్టెంబరు 22న కౌన్సెలింగ్ కేంద్రానికి తిరిగి రావాలని దంపతులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.