Domestic Flights charges: పెరిగిన డొమెస్టిక్ విమానాల ఛార్జీలు

Thu, 11 Feb 2021-9:42 pm,

Lockdown విధించిన అనంతరం గతేడాది మే 21న విమానసేవలు అందుబాటులోకి రాగా.. అప్పటి నుంచే Flight ticket charges నియంత్రణ కోసం కేంద్రం Air fare band విధానాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది.

అన్‌లాక్ మిషన్ ప్రారంభమైన అనంతరం ఎప్పటికప్పుడు Fare band policy ని పొడిగిస్తూ వచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ.. నేడు తొలిసారిగా లోయర్, అప్పర్ ఫేర్ బ్యాండ్స్‌లో చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Fare bands rules ప్రకారం 40 నిమిషాలలోపు ప్రయాణించే విమానాలు ఫస్ట్ ఫేర్ బ్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఈ ఫేర్ బ్యాండ్‌లో రూ.2000 గా ఉన్న పరిమితిని రూ.2200 కి పెంచారు. అలాగే అప్పర్ లిమిట్‌లో ఇదివరకు రూ.6000 గా ఉన్న చార్జీల పరిమితిని ఏకంగా రూ. 7800 వరకు పెంచారు.

ఇతర ఫేర్ బ్యాండ్స్ విషయానికొస్తే..  40-60 నిమిషాలు, 60-90 నిమిషాలు, 90-120 నిమిషాలు, 120-150 నిమిషాలు, 150-180 నిమిషాలు, 180-210 నిమిషాలలోపు ప్రయాణించే విమానాలు ఉన్నాయి. వీటినిబట్టే Flight ticket booking prices ఉండనున్నాయి.

ఇప్పటికే కరోనా కష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మధ్య, దిగువ తరగతి కుటుంబాలు వారికి అత్యవసరంలో Flight journey చేయాలన్నా ఇకపై ఆలోచించాల్సిన పరిస్థితే ఏర్పడిందంటున్నారు కామన్ మ్యాన్. 

Also read : LIC policy holders: ఎల్ఐసి పాలసీ హోల్డర్స్‌కి Good news.. LIC IPO వీళ్లకే ప్రాధాన్యత

 

Also read : Anchor Sreemukhi Goa trip photos: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. ఫోటోలు వైరల్

 

Also read : LPG Price hiked: భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు.. ఇకపై LPG కి ఎంత Pay చేయాలంటే..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link