Air India, tata deal : టాటా గూటికే మళ్లీ ఎయిర్ ఇండియా
68 ఏళ్ల తర్వాత మళ్లీ తన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను దక్కించుకున్నటాటా సన్స్... టాటా సన్స్ వేసిన బిడ్‌ను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం. (Image Credits: Indian Diplomacy/Twitter)
విక్రయానికి సంబంధించి 2021 డిసెంబర్ నాటికి పూర్తికానున్నవిధి విధానాలు
ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి రూ. 61,562 కోట్ల రుణభారంతో ఉన్న ఎయిర్ ఇండియా
ఒకప్పుడు టాటా సంస్థ స్థాపించిన ఎయిర్ ఇండియా సంస్థను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్థ శతాబ్దం పైనే అయ్యింది. ఇప్పుడు టాటా సంస్థ రూ. 18,000 కోట్లకు బిడ్ వేసి మళ్లీ ఎయిర్ ఇండియాను తన సొంతం చేసుకుంది.
ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా సన్స్ గెల్చుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే 'వెల్‌కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రతన్ టాటా. (Image Credits:Twitter)
టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ హోదాలో ఉన్న రతన్ టాటా, జెఆర్‌డీ టాటా నాయకత్వంలో నడిచిన ఎయిర్ ఇండియా గతంలో ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక విమానయాన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని గుర్తు చేసుకున్నారు రతన్ టాటా.