Aishwarya Rai- Abhishek Bachchan: ఐశ్వర్య - అభిషేక్ మధ్య గొడవలు.. నిజమే అంటూ క్లారిటీ ఇచ్చిన ఐష్..!

Mon, 23 Sep 2024-1:24 pm,

ప్రముఖ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని ఎన్నో చిత్రాలలో నటించి ఇటు సౌత్ ఆడియన్స్ ని కూడా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

గతంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమాయణం నడిపిన ఈమె పెళ్లి వరకు వెళ్లకుండానే అతనితో బ్రేకప్ చెప్పుకొని,  ఆ తర్వాత బిగ్ బీ వారసుడు ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి, అతడిని వివాహం చేసుకుంది. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఆరాధ్య జన్మించిన విషయం తెలిసిందే.   

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట,  గత కొంతకాలంగా రూమర్స్ ఎదుర్కొంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయని, దీనికి తోడు ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఐశ్వర్య కూతురితో మాత్రమే కనిపించడం, అత్తమామలతో కలవకపోవడం అన్నీ కూడా విభేదాలు ఉన్నాయనే రూమర్స్ కి ఆజ్యం పోశాయి .

అయితే ఎప్పటికప్పుడు ఈ జంట రూమర్స్ పై క్లారిటీ ఇచ్చినా.. ఎవరు కూడా నమ్మలేదు. ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్స్ క్రియేట్ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితం కపిల్ శర్మ టీవీ షోలో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ తో.. గొడవలపై క్లారిటీ ఇచ్చింది. “మేమిద్దరం గొడవలు పడతాము.  అలా గొడవలు పడితేనే కదా దాంపత్య జీవితం సాఫీగా సాగేది”.   

“ఇకపోతే గొడవ ఏదైనా సరే ఆ గొడవ తర్వాత మొదటిసారి నేనే క్షమాపణలు చెబుతాను. తద్వారా ఆ గొడవ అప్పటితో ముగిసిపోతుంది” అంటూ తన మంచి మనసును చాటుకుంది ఐశ్వర్యరాయ్. మొత్తానికి అయితే ఐశ్వర్యరాయ్ తన భర్త నుంచి విడిపోవడానికి సముఖంగా లేదు అని చెప్పి రూమర్స్ కి చెక్ పెట్టింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link