Aishwarya - Salman Pics: అభిషేక్ బచ్చన్ కు హ్యాండ్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్.. సల్మాన్ తో చెట్టాపట్టాల్..

Mon, 16 Dec 2024-5:09 pm,

Aishwarya - Salman Pics: ఐశ్వర్య రాయ్.. ఒకప్పటి మాజీ ప్రపంచ సుందరి.. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఇద్దరు’ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసి ఔరా అనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి అక్కడ నెంబర్ వన్ కథానాయకగా సత్తా చాటింది.

అంతేకాదు హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నపుడే అప్పటి బాలీవుడ్ కథానాయకుడు వివేక్ ఓబెరాయ్ తో ఈమె ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత సల్మాన్ తో ఐష్ చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అప్పట్లో ఐష్ విషయంలో సల్మాన్, వివేక్ వీధిన పడి కొట్టుకున్నారు.

ఆపై అప్పటి బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తో ఈమె పీకలోతు ప్రేమలో మునిగిపోయింది. ఆ తర్వాత సల్మాన్.. ఐష్ విషయంలో సైకోలా ప్రవర్తించడంతో అతనికి బ్రేకప్ కూడా చెప్పేసింది. సల్మాన్, ఐశ్వర్య కలిసి ‘హద్ దిల్ దే చుకే సనమ్’ తో పాటు పలు చిత్రాల్లో కలిసి నటించింది.

 

ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐతే పెళ్లై దాదాపు 15 యేళ్లు కావొస్తోంది. ఈ టైమ్ లో వీళ్లిద్దరు మధ్య మనస్పర్థలు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐష్ తన మాజీ ప్రియుడు సల్మాన్ తో ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న  ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యితే.. ఒకప్పుడు తనను ప్రేమ పేరుతో వేధించిన సల్మాన్ తో ఐశ్వర్య ఇలా తిరగడం చూసి అభిమానులు కూడా ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. వీళ్లిద్దరు కలిసి తిరుగుతున్న ఈ ఫోటోలు AI జనరేటేడ్ పిక్స్ అని తేలడం అభిమానులు అవాక్కవుతున్నారు.

 

అచ్చు నిజమనేలా ఉన్న వీళ్ల ఫోటోలు చూసి కామన్ ఆడియన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో మంచిని గ్రహించడం తప్పు లేదు. ఇలాంటి ఫేక్ పిక్స్ తో జనాలను కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారా అని ఫస్ట్రేట్ అవుతున్నారు.  

 

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సాయంతో క్రియేట్ చేసిన  ఫోటోల్లో ఐష్, సల్మాన్ ఇద్దరు ఒకే రకమైన డ్రెస్సులు ధరించారు. అంతేకాదు ముంబై రోడ్లపై షికార్లు చేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు.

అందులో 'గేట్‌వే ఆఫ్ ఇండియా' వద్ద వీరిద్దరు ఐస్‌క్రీం, వడ పావ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ పిక్స్ ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్నో యేళ్ల క్రితం విడిపోయిన ఈ జంటను AI సాయంతో ఒక్కటి చేసిన వారిని కొంత మంది అభిమాలు మెచ్చుకుంటూ ఉంటే.. మరికొందరు పెళ్లై ఓ పిల్లున్న తల్లిని ఇలా వేరే హీరోతో ఎఫైర్ నడిపిస్తున్నట్టుగా పిక్ క్రియేట్ చేయడం దారుణమంటున్నారు. ఏది ఏమైనా చాలా రోజుల తర్వాత సల్మాన్, ఐష్ మరోసారి వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link