Amala: కొత్త కోడలి గురించి తొలిసారి మాట్లాడిన అమల.. ఇన్ డైరెక్ట్‌గా సమంతపై భలే సెటైర్ వేసిందిగా..!
చైతు, శొభితల పెళ్లి ఏర్పాట్లు పూర్తికావస్తున్నట్లు తెలుస్తొంది. అన్న పూర్ణ స్టూడియోస్ లో.. వీరి పెళ్లికోసం గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్కినేని అభిమానులు మాత్రం.. చైతు, శోభితల పెళ్లి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంట.
మరొవైపు ఇటీవల వీరి హల్దీ వేడుక.. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. అంతే కాకుండా.. శోభిత, చైతులకు మంగళ స్నానాలు కూడా చేయించారు. ప్రస్తుతం శోభిత మాత్రం.. రకరకాల కాస్ట్యూమ్ లు, చీరలలో పుత్తడి బొమ్మల కన్పిస్తుంది.
శోభిత ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతుంది. చైతు కూడా..శోభితతో కొత్తజీవితం స్టార్ట్ చేసేందుకు ఈగర్ గా ఎదురు చూస్తున్నట్లు కూడా ఇటీవల ఓపెన్ అయ్యాడు. ఈ క్రమంలో వీరి పెళ్లికి 300 ల మంది అతిథులు రానున్నారని తెలుస్తొంది.
అయితే.. అక్కినేని అమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారంట. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కాబోయే కోడలికి మీరు ఏవైన సలహాలు, ఎలా ఉండాలని కొరుకుంటున్నారని క్వశ్చన్ ఎదురయ్యాయంట.
దీనికి అమల మాట్లాడుతూ.. తనకు కాబోయే కోడలికి సలహలు ఏమి ఇవ్వడంలేదని అన్నారంట. అంతే కాకుండా.. ఒక మంచి భార్యగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నట్లు చెప్పారంట. మరోవైపు శోభిత గురించి మాట్లాడుతూ.. తను చాలా మెచ్యుర్డ్ గా ఆలోచిస్తుందని, ఇంటెలిజెంట్ అని ప్రశంసలు కురిపించిందంట.
చైతు, జంట ఒకర్ని మరోకరు అర్థం చేసుకుని, హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు అమల చెప్పారంట. అయితే.. శొభిత ఇంటికి రాకముందే అమలు గ్రిప్ లో పెట్టుకునే విధంగా బాగా ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంట. ఇదే విధంగా సమంతకు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదంటున్నారంట.. మంచి భార్యగా ఉండాలని అంటున్నారు.. అంటే.. సామ్.. మంచి భార్యగా ఉండలేదని ఆమెను ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేస్తున్నారా.. అనికూడా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారంట. ప్రస్తుతం అమల మాట్లాడిన మాటలు మాత్రం నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.