Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
Pushpa 2 the Rule First Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప పార్ట్ 1 ది రైజ్’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప తగ్గేదేలే అంటూ చెప్పిన డైలాగ్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ముఖ్యంగా నాన్ రాజమౌళి హీరోగా తెలుగు నుంచి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి. అంతేకాదు పుష్ప సినిమాలోని నటనతో జాతీయ స్థాయిలో తొలి సారి ఓ తెలుగు హీరోకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా బన్ని రికార్డు క్రియేట్ చేసాడు.
పుష్ప 1 సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగం పూర్తి కావడానికి పూర్తిగా ఐదేళ్ల సమయం పట్టింది. మధ్యలో కరోనా ఇతరత్రా కారణాల వల్ల ఈ సినిమా లేట్ అయింది. పైగా సుకుమార్ ప్రతి ఫ్రేమ్ బాగా రావాలనే తపన కనబడింది. రీసెంట్ గా గుమ్మడికాయ కొట్టిన ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కావడంతో తాజాగా సెన్సార్ కు వెళ్లింది. కొన్ని కట్స్ తో ఈ సినిమాకు UA సర్టిఫికేట్ జారీ చేసారు. సినిమా నిడివి 200 నిమిషాలు.. అంటే 3 గంటల 20 నిమిషాలు ఉంది.
సెన్సార్ వాళ్లు ఈ సినిమా చూసి బాగా వచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ మరోసారి జాతీయ అవార్డు కోవడం పక్కా అని చెబుతున్నారు. మరోవైపు రష్మిక కూడా జాతీయ అవార్డు వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు యాక్షన్ సీన్స్.. ఎమోషనల్ సీన్స్ అన్ని బాగా పండాయంటున్నారు.
ట్రైలర్ కట్ చేసినట్టే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ ను ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు అలరించడం పక్కా అని చెబుతున్నారు. ఫుష్ప 2 సినిమా టికెట్ రేట్స్ హైక్ కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పర్మిషన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే 2 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు.
దాదాపు రిలీజ్ కు ముందు రూ. వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అందుకు తగ్గట్టు ఈ సినిమా ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ను దున్నేస్తుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.