Corn Benefits: వర్షాకాలంలో డైలీ మొక్కజొన్న తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే...

Sat, 15 Jun 2024-4:07 pm,

కొన్నిరోజులుగా దేశంలో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల ప్రభావం వల్ల అనేక చోట్ల మోస్తరు నుంచి భారీగానే వర్షాలు పడుతున్నాయి. ఇక రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా మంది వర్షాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

ముఖ్యంగా వర్షంలో మక్కలను తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.  ఒకవైపు వర్షం పడుతుంటే, మరోవైపు వేడి వేడి మక్కలను కాల్చుకుని తింటే ఆ టెస్ట్ మరో విధంగా ఉంటుంది. ఇక మక్కలను తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య లాభాలు కల్గుతాయని నిపుణులు చెబుతుంటారు. 

మొక్కజొన్నలో బి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. దీన్ని నుంచి మన శరీరానికి కావాల్సిన బి1, బి5లతో పాటు విటమిన్‌ సి కూడా లభిస్తుంది. మొక్కజొన్నలో ఉండే కార్బొహైడ్రేట్లుమనం తిన్న ఆహరం జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి. మొక్కజొన్నలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. 

వీటిలో ఉండే రైబోఫ్లేవిన్ కారకాల వల్ల.. మధుమేహంను తగ్గించే గుణాలను కల్గిఉంటాయి. మలబద్దకం సమస్య కూడా ఉండదు. పేగు క్యాన్సర్ వంటి రోగాలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతుంటారు.

మొక్కజొన్నలో కాల్షియం, మెగ్నిషియం లు పుష్కలంగా ఉంటాయి.  దీంతో ఎముకలు బలంగా మారతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల దీర్ఘకాలిక సమస్యలు అన్ని దూరమైపోతాయి.

ముఖంపై వయస్సు కాక ముందే వచ్చే ముడుతలు, నల్లని మచ్చలను నివారించే గుణాలు కూడా మక్కలలో ఉంటాయని నిపుణులు చెబుతుంటారు.మక్కలను కొందరు కాల్చుకుని తింటే, మరికొందరు ఉప్పు వేసుకుని తింటారు. మక్క గింజలను ఉడకబెట్టి అందులోకారం, ఉప్పు వేసుకుని తింటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link