Summer Health Tips: కీరదోసకాయ ఆరోగ్యానికి మహాభాగ్యం.. వేసవి తాపాన్ని తగ్గించే అద్భుత ఔషధం..

Fri, 15 Mar 2024-8:04 am,

 కీరదోసకాయలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా కలిగి ఉంటాయి. అందుకే మీకు తెలుసా? వీటిని సౌందర్య సాధనాలలో కూడా వినియోగిస్తారు. దీంతో చర్మం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది.  

కీరదోసకాయలు ఎక్కువగా నీరు, ఎలక్ట్రోలైట్స్ అనే పదార్థాలను కలిగి ఉంటాయి. అందుకే బయట బాగా వేడిగా ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత వీటిని తీసుకోవడం వల్ల దాహం లేదా డీహైడ్రేషన్ అనిపించదు. అలసట కూడా తెలీదు.  

 శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీటి శాతం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. యుఎస్‌డిఎ ప్రకారం 142 గ్రాముల బరువున్న ఒక కప్పు తరిగిన పచ్చి కీరదోసకాయలో సుమారు రెండు మైక్రోగ్రాముల విటమిన్ కె ఉంటుంది.  

 విటమిన్ కె అనేది మన శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహాయపడే సాధనం లాంటిది. విటమిన్ కె మరియు కాల్షియం సరైన మోతాదులో తీసుకోవడం వల్ల. ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. కీర దోసకాయను మీ డైట్లో చేర్చుకుంటే ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయంగా ఉంటుంది.  

కీరదోసకాయలు కుకుర్బాసి కుటుంబానికి చెందినవి దోస కాయలో కుకుర్బిటాసిన్ అనే పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం కుకుర్బిటాసిన్లు, క్యాన్సర్ కణాల పెరుగుదలను గణనీయంగా నిరోధించగలవని, అలాగే ఇది క్యాన్సర్ యొక్క నివారణను సూచిస్తుంది.   

133 గ్రాములు కీరా దోసకాయలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒక గ్రాము ఫైబర్ మన శరీరానికి అందుతుంది. రోజువారీ ఆహారంలో ఫైబర్ ను జోడించడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎండకాలం కీరదోసకాయను తీసుకుంటూ ఉండటం వల్ల శరీరంలో నీటి స్థాయిలు అదుపులో ఉంటాయి. వడదెబ్బ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.  

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఆహారంలో ఫైబర్ చేర్చడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను నిర్వహించడంలో మరియు హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యానికి కూడా కీరదోసకాయ ఎంతో మంచిది (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link