Amazon Sale 2024: అమెజాన్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు, ఈ 4 ల్యాప్‌టాప్‌లపై 55 శాతం తగ్గింపు

Thu, 08 Aug 2024-12:32 pm,

ఆగస్టు 7వ తేదీన ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై బారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా డెల్, లెనోవో, హెచ్పి, ఏసస్, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌‌లపై ఏకంగా 45 శాతం వరకూ ఆఫర్లు ఉన్నాయి. టాప్ 4 ల్యాప్‌టాప్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Lenovo Idea Pad Gaming 3 Laptop

గేమింగ్, గ్రాఫిక్ డిజైనర్లకు బెస్ట్ ల్యా ప్‌టాప్. ఇందులో ఏఎండీ రైజన్ 5-5500 హెచ్ ప్రోసెసర్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ వెర్షన్ కలిగి ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ఐపీఎస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో ఎన్విడా ఆర్టీఎక్స్ 2050 4జీబీ గ్రాఫిక్ కార్డు ఉంటుంది. విండోస్ 11, అలెక్సా, మూడు నెలల గేమ్స్ ఇన్ బిల్ట్ అయి ఉటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర 44,990 రూపాయలు.

Dell 15 Thin and Lite Laptop

ప్రొఫెషనల్స్‌కు ఇది బెస్ట్ ల్యాప్‌టాప్. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 -1215 యు ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వెర్షన్‌తో ఉంటుంది. ర్యామ్ 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. విండోస్ 11 ఇన్ బిల్ట్ అయి ఉంటుంది. ఈ ల్యాప్‌ట్యాప్ ధర అమెజాన్‌లో కేవలం 33,990 రూపాయలుగా ఉంది. 

Asus Vivo Book Go 13

ఇది కూడా చాలా చౌక ధరకు లభిస్తోంది. ఇది 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది కూడా ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4500 ప్రోసెసర్, 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుంది. విండోస్ 11 హోమ్ ప్రీ లోడ్ అయి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర కేవలం 22,749 రూపాయలు మాత్రమే.

Lenovo V15 G2 Laptop

ఈ ల్యాప్‌టాప్ విద్యార్ధులకు చాలా అనువైనది. చాలా తక్కువ ధరకు లభ్యమౌతోంది. ఇది 15.6 ఇంచెస్ స్క్రీన్ ఫుల్ హెచ్‌డితో వస్తోంది. ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4500 ప్రోసెసర్ , 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 ఇన్ బిల్ట్ అయి ఉంటుంది. గరిష్టంగా 6.5 గంటల బ్యాటరీ లైఫ్ టైమ్ ఉంటుంది. ఎథర్నెట్ కనెక్టివిటీ, డాల్బీ ఆడియో సిస్టమ్ ఉంటుంది. అమెజాన్లో కేవలం 24,449 రూపాయలే పొందవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link