Amla Benefits: ఉసిరితో కలిగే ప్రయోజనాలు వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది
కంటి ఆరోగ్యం
రోజూ ఉసిరి తినడం వల్ల కళ్లకు చాలా మంచిది. కంటి చూపు పెరుగుతుంది. కంటి సంబంధిత కేటరాక్ట్ , రెటినల్ డిసార్డర్స్ సమస్యలకు ఉసిరి మంచి పరిష్కారం
బరువు నియంత్రణలో
ఉసిరి క్రమం తప్పకుండా రోజూ తినడం వల్ల బరువు నియంత్రణకు దోహదపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గుతుంది.
గుండె ఆరోగ్యం
ఉసిరి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నియంత్రిస్తుంది.
మధుమేహం నియంత్రణ
రోజూ ఉసిరి తింటుంటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఉపయోగం కలుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
కేశాలకు లాభం
ఉసిరి తినడం వల్ల కేశాల ఎదుగుదల బాగుంటుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. జుట్టుని కుదుళ్ల నుంచి పటిష్టం చేస్తుంది.
జీర్ణక్రియ
ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో విసర్జన ప్రక్రియ సులభమౌతుంది. ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.
విటమిన్ సి
ఉసిరి రోజూ తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో సమృద్దిగా లభించే విటమిన్ సి కారణంగా ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది.