19 Years of Amrutham: 19 సంవత్సరాలుగా తెలుగు వారి గుండెల్లో అమృతం వర్షం
2001 నవంబర్ లో అమృతం తొలిసారి టెలికాస్ట్ అయింది. సింపుల్ కామెడీ లైన్స్, హుందాగా అనిపించే డైలాగ్స్ వెరసి తెలుగు ప్రేక్షకులు ఈ సిరియల్ కు ఫిదా అయిపోయారు.
అప్పాజీ నుంచి ఆంజనేయులు వరకు అన్ని పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు. వారిని ఇంట్లో సభ్యులుగా భావించడం మొదలు పెట్టారు.
ప్రతీ పాత్ర, ప్రతీ డైలాగ్, ప్రతీ ఏపిసోడ్ ఎప్పటికీ మెమోరెబుల్...
ఏడవడానికి ఒక కారణం చాలు..కానీ నవ్వడానికి వెయ్యి కారణాలు దొరుకుతాయి. ముందు నవ్వడానికి సిద్దంగా ఉండాలి. జీవితం అంటే అదే.
ఆ తరం ఇక రాకపోయినా..నాటి అమృతం మళ్లీ ఈరోజు నుంచి జీ5లో అందుబాటులోకి వస్తోంది. ఎంజాయ్ చేయండి.