Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్,రాధిక మర్చంట్ ల పెళ్లి ఘనంగా జరిగిది. వీరి పెళ్లికి ముంబైలోని జియోవరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికైంది. జులై 12 న పెళ్లి,13న శుభఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవాల్ కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి.
అనంత్, రాధికల పెళ్లికి ప్రపంచ నలుమూలల నుంచి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు.ఈ నేపథ్యంలో.. వీరి పెళ్లి కొన్నితరాలు గుర్తుంచుకునే విధంగా జరిగిందని మాత్రం చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఇంట్లో మరల సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ముఖేష్ అంబానీ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఫార్చూన్ 500 జాబితాలో.. రెండు స్థానాలు ఎగబాకి 86 వ స్థానానికి చేరుకున్నారు. గతంలో 2021 లో 155 వ ర్యాంక్ నుంచి ఏకంగా 69 స్థానాలు పైకి ఎగబాకింది.
ఫార్చూన్ గ్లోబల్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీ మరల ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. రిలయన్స్ ఆదాయం.. 108.877 మి.డా. లాభాలు 1.3 శాతంపెరిగి.. 8,413 మి.డా. లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్ సంస్థలో ప్రస్తుతం 3,50,000 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్ లలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఫార్చూన్ ర్యాంకింగ్స్ లో.. తొమ్మిది భారతీయ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఐదు ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి.
ఎల్ఐసీ 12 స్థానాలు పైకి ఎగబాకి 2024 లో 95 స్థానానికి చేరుకుంది. ఐఓసీ 22 స్థానాలు ఎగబాకి 116 స్థానానికి చేరుకుంది.ఎస్బీఐ 57 స్థానాలు పైకి ఎగబాకి 178 స్థానం చేరుకుంది. ఓఎన్జీసీ, బీపీసీఎల్ లు వరుసగా.. 180,258 స్థానాల్లో నిలిచాయి.
అదే విధంగా.. టాటా మోటర్స్ 271, హెడ్డీఎఫ్ సీ 306 స్థానంలో, రాజేష్ ఎక్స్ పోర్ట్స్ 463 స్థానంలో నిలిచాయి. అదే విధంగా.. వాల్ మార్ట్, అమెజాన్, స్టేట్ గ్రిడ్ లు ఫార్చూన్ గ్లోబలర్ 500జాబితాలో.. మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
అనంత్ రాధికల పెళ్లి తర్వాత అన్నివిధాలుగా, ముఖేష్ కుటుంబానికి కలిసి వస్తుందని కూడా అనేక కథనాలు ఇదివరకే ప్రచురితమయ్యాయి. వాటికి బలం చేకూర్చేలా కూడా ప్రస్తుతం ఫార్యూన్ లో రిలయన్స్ కంపెనీ గతంకంటే మెరుగైన స్థానంలో చేరుకొవడంతో ముఖేష్ కుటుంబంతొ పాటు, రిలయన్స్ సంస్థ ఉద్యోగులు కూడా సంబరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.