Anasuya Bharadwaj: చీరకట్టులో కన్నుగీటుతూ అభిమానులను కవ్విస్తోన్న అనసూయ..

Thu, 07 Mar 2024-2:08 pm,

జబర్దస్త్  కామెడీ షో యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  కెరీర్‌ మొదట్లో టెలివజన్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో వ్యాఖ్యాతగా పాపులర్ అయింది.

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు సంపాదించింది. అక్కడ కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త.

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో ఈమె పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. మంచి నటిగా సత్తా చూపెడుతోంది.

సినిమాల్లో వరుస అవకాశాలు పెరగడంతో తనకు లైఫ్‌ ఇచ్చిన జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది అనసూయ.

తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను కవ్విస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.   దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link