Anasuya Bharadwaj: సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న అనసూయ భరద్వాజ్..

Mon, 25 Mar 2024-10:21 am,

యాంకర్ అనసూయ భరద్వాజ్ కెరీర్‌ షురూలో టెలివిజన్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్ పాపులర్ అయింది.

జబర్దస్త్ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. అక్కడ కూడా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకుంది రంగమ్మత్త.

ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా, రంగస్థలం, గాడ్ ఫాదర్ సహా పలు చిత్రాల్లో ఈమె పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. తాజాగా రజాకార్ చిత్రంలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

సినిమాల్లో వరుస అవకాశాలు పెరగడంతో తనకు లైఫ్‌ ఇచ్చిన జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది.

తాజాగా సంప్రదాయ చీరకట్టులో కనిపించి  మురిపించింది. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.  దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link