Rashmi Gautam: యాంకర్ రష్మీ అందాల మెరుపులు.. మతిపోగొట్టే పోజులు
బుల్లితెరపై యాంకర్ రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా కెరీర్ మొదలు పెట్టినా.. యాంకర్‌గానే ఈ భామకు భారీ పాపులారిటీ వచ్చింది.
యాంకర్‌గా వచ్చిన ఫేమ్‌తో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది రష్మీ. బిగ్ స్క్రీన్‌పై విచ్చలవిడి అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది.
గతేడాది బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది రష్మీ. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ దక్కలేదు.
అనసూయ యాంకరింగ్‌ను వదిలేయడంతో రష్మీకి బుల్లితెరపై ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అన్ని స్పెషల్ షోల మెరవడంతో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్‌గా వ్యవహరిస్తోంది.
జబర్దస్త్ షో నుంచి ఒక్కొక్కరు తప్పుకున్నా.. రష్మీ మాత్రం కంటిన్యూ అయింది. వేరే ఛానెల్స్ నుంచి ఆఫర్లు వచ్చినా.. ఈ బుల్లితెర బ్యూటీ తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి.