Vishnupriya Photoshoot : సాంబ్రాణి ధూపం.. పెంచింది తాపం.. పిచ్చెక్కిస్తోన్న యాంకర్ విష్ణుప్రియ
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలతో ఫేమస్ అయింది విష్ణుప్రియ. ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. పోవే పోరా షోతో మంచి ఇమేజ్ సంపాదించుకుంది.
అయితే సిల్వర్ స్క్రీన్ మీద చేసిన చెక్ మేట్ సినిమాలో హద్దులు దాటే అందాల ప్రదర్శన చేయడంతో విమర్శలు మూటగట్టుకుంది. ఆ తరువాత సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉంటూ వచ్చింది.
విష్ణుప్రియ ఫోకస్ అంతా కూడా బుల్లితెరపైనే పెట్టేసింది. బుల్లితెరపై జబర్దస్త్, అదిరింది, బొమ్మ అదిరింది, పండుగ ఈవెంట్లో స్కిట్లు, స్టెప్పులు వేస్తూ ఉండేది.
యూట్యూబ్‌లో విష్ణుప్రియ తన పేరు మీదుగా పెట్టుకున్న చానెల్ ద్వారా బాగానే సంపాదించేస్తోంది. తన యూట్యూబ్ ఆదాయం భారీగా ఉందంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
విష్ణుప్రియ ఈ మధ్య యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ మానస్‌తో కలిసి విష్ణుప్రియ చేసిన ప్రైవేట్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది. మాస్ స్టెప్పులతో ఇద్దరూ కుమ్మేశారు.
ప్రస్తుతం యాంకర్ విష్ణుప్రియ బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా దూసుకపోతోంది. సినిమా ఆఫర్ల కోసం విష్ణుప్రియ ఆరాట పడుతున్నట్టుగా అనిపిస్తోంది.