AP New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లై చేసుకోండి..
AP Ration Cards: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలను ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తక్కువ ధరకే మద్యంతో పాటు.. త్వరలో మహిళలకు ఉచిత బస్పు సౌకర్యాన్ని కల్పించేందుకు రెడీ అవుతోంది.
తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామిల మేరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇష్యూ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఈ క్రమంలోనే రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసే ఛాన్స్ ప్రభుత్వం కల్పించింది. నేటి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రానుంది.
ఈ నెల 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనుున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులపై YCP రంగుల తో పాటు జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ను ప్రింట్ చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైనట్లు తెలుస్తోంది.