Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..

Sat, 20 Jul 2024-9:58 pm,

ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సింగపూర్ కు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. ముందస్తుగా పవన్ తన ప్లాన్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదని తెలుస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి సింగపూర్ లోని ప్రఖ్యాత యూనివర్సీటీ నుంచి పట్టాను పొందారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హజరయ్యారు. అంతేకాకుండా.. తన భార్యకు బెస్ట్ విషేస్ కూడా చెప్పారు. 

సింగపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టాను అన్నా లెజీనోవా అందుకున్నారు. ఇదిలా ఉండగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

పవన్ సింగపూర్ లో ఎంతో స్టైలీష్ గా కన్పిస్తున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ లో పవన్ భలే ఉన్నారుగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..  2011లో వచ్చిన 'తీన్‌మార్' చిత్రంలో పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో వీళ్ల మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. అది పెళ్లి వరకూ వెళ్లింది.

అన్నాలేజీనోవాను పవన్ కళ్యాణ్.. 2013లో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే లెజినోవాకు తన మొదటి వివాహం ద్వారా పుట్టిన ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు పోలేనా అంజనా పవనోవా. రష్యాకి చెందిన అన్నా లెజినోవా మోడల్‌గా, నటిగా పలు సినిమాల్లో నటించారు. 

ఫారెన్‌లో పుట్టి పెరిగినప్పటికీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. బయటికి ఎక్కడకి వెళ్లినా ట్రెడిషనల్ లుక్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. మెగా ఫ్యామిలీలో సైతం ఇట్టే కలిసి పోతారు. ముఖంపై చక్కని చిరునవ్వు, పవన్ కు తగ్గ అర్థాంగీ అంటూ నెటిజన్లు అన్నా లేజీనోవాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link