Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన డీజీపీ ద్వారక తిరుమల రావు.. కారణం ఏంటంటే..?
ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల ఆయన మాట్లాడుతూ.. తాను హోంమంత్రి అయితే.. పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. అంతే కాకుండా.. పోలీసులు ఏంచేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల ఏపీలో పవన్ కళ్యాణ్ సంచలనంగా మారారని చెప్పుకొవచ్చు. అంతే కాకుండా.. పవన్ ఏపీ పోలీసు శాఖఫై మండిపడ్డారు. కొంత మంది పోలీసులు విధుల్లో నెగ్లీజెన్సీగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇంత చెప్తున్న కూడా.. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు జరగటం ఏంటని మండిపడ్డారు.
అంతే కాకుండా.. తాను హోంమంత్రి అయితే సిట్యూవేశన్ మరోలా ఉంటుందని మండిపడ్డారు. అదే విధంగా ఇటీవల సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ లపై కూడా సీఎం చంద్రబాబు తో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియాలోట్రోలింగ్ లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. అంతేకాకుండా.. ఇక మీదట తప్పుడు పోస్టులు, ట్రోలింగ్ లు చేయాలంటే భయపడాలని కూడా ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
పవన్ కళ్యాణ్ మాత్రం.. ఇటీవల సనాతన ధర్మం అంటూ కూడా తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్రం హోంమంత్రి అమిత్ షాను కలవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అంతేకాకుండా.. ఆయనకు కేంద్రం మరో కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం కూడా జరిగింది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీలో మాత్రం.. ఒక వైపు సోషల్ మీడియాలో ఫెక్ ట్రోలింగ్స్ లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు బాస్ ద్వారాక తిరుమల రావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే.. సామాజిక మధ్యమాలలో పోస్టుల ఘటన, అరెస్ట్ లపై డిప్యూటీ సీఎంతో పోలీసు బాస్ చర్చించినట్లు తెలుస్తొంది.